బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న మూవీ ‘వార్ 2’. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ తరహా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.