AP: హోం మంత్రి అనిత మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు నీతులు చెప్పే స్థాయిలో జగన్ లేరన్నారు. ఆస్తిలో వాటా కోసం తల్లి, చెల్లిపై జగన్ కోర్టుకెక్కారని తెలిపారు. వారానికి మూడు రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ చేస్తున్నారని, టైంపాస్ రాజకీయాల కోసం ఏపీకి వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో సీఎం అని చెప్పుకుని జగన్ కోర్టు వాయిదాలు ఎగ్గొట్టారని వెల్లడించారు.