ప్రకాశం: మార్టూరులోని టీడీపీ క్యాంపు కార్యాలయం నందు ఈనెల 25వ తేదీన జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొంటారని పార్టీ కార్యాలయ వ్యక్తిగత సిబ్బంది బుధవారం పత్రిక ప్రక్రియ ద్వారా తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.