తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి భారత వాతావరణశాఖ ‘దానా’ తుపానుగా నామకరణం చేసింది. ఇంతకీ దానా అంటే ఏమిటి..? ఆ పేరు ఎలా వచ్చింది..? అనే చర్చ మొదలైంది. అయితే, దానా అనే పేరుకు అరబిక్‌లో సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందంట. అరబిక్ భాషలో ఈ పదం ‘అందమైన ముత్యం’ అనే అర్థాన్ని సూచిస్తుంది. ఇక ‘దానా’ అనే పేరును ఖతర్ దేశం సూచిస్తుంది. అంతర్జాతీయ తుపాను నామకరణ విధానంలో భాగంగా ఈ పేరును సూచించినట్లు సమాచారం.