మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంవీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు అయ్యింది. దీంతో ఉద్ధవ్ సేన తొలి జాబితా విడుదల చేసింది. 85 సీట్ల చొప్పున మూడు పార్టీలతో పోటీకి నిర్ణయం తీసుకున్నారు. 270 సీట్లలో ఏకాభిప్రాయం కుదిరడంతో మిగతా సీట్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీంతో 65 మందితో ఉద్ధవ్ థాక్రే తొలి జాబితా విడుదల చేశారు.