NLR: అల్లీపురంలోని డంపింగ్ యార్డును నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య బుధవారం పరిశీలించారు. యార్డు లోపలకు చెత్త సేకరణ వాహనాలు వెళ్లకుండా గేటు సమీపంలోనే వ్యర్థాలు వేస్తుండడంతో గమనించిన ఆయన ఇలాంటి విధానం సరికాదని సిబ్బందిని హెచ్చరించారు. తడి, పొడి చెత్తను తప్పనిసరిగా విడివిడిగా సేకరించి డంపింగ్ కూడా విడివిడిగా వేయాలని ఆదేశించారు.