వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఒకే నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక నియోజకవర్గ స్థానం వయనాడ్ అని వెల్లడించారు. ప్రియాంక అధికారిక ఎంపీగా ఉంటే తాను అనాధికార ఎంపీగా కొనసాగుతానని తెలిపారు. ఇద్దరం కలిసి వయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.