వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నానని తెలిపారు. అంతకుముందు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాల కోసం రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. రాజకీయానికంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.