దేశంలో ఇటీవల తరచూ వైమానిక సంస్థలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంకేత్ ఎస్ భోంఢ్వే సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. నేరాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఎక్స్ తీరు ఉందంటూ మండిపడ్డారు. వాటిని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రం ఎక్స్‌ను కోరింది.