చిత్తూరు: మంచి తనంతో ఆశ్రయం ఇస్తే ఇంట్లోని బీరువాను పగలగొట్టి రూ. 50 వేల నగదును అపహరించినట్లు బాధితుడు వాపోయాడు. పుంగనూరు పట్టణం నక్కబండలో ఉంటున్న హుస్సేన్ తన బంధువైన బాబాకు నిన్న రాత్రి ఇంటిలో పడుకునేందుకు ఆశ్రయం కల్పించాడు. ఇవాళ ఉదయం హుస్సేన్ పనుల నిమిత్తం బయటకి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి డబ్బులు దొంగిలించినట్లు గుర్తించాడు.