కృష్ణా: బాపులపాడు మండలం పెరికీడు గ్రామ సచివాలయంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. సచివాలయం తాళాలు బద్దలుకొట్టి లోపల ఉన్న ప్రింటర్స్, సౌండ్ స్పీకర్లను ఆగంతకులు చోరీ చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ ఎస్సై సురేశ్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.