TG: సినీ నటుడు నాగార్జున మంత్రి కొండా సురేఖపై వేసిన పరువునష్టం దావాపై హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిపారు. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. కోర్టు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. అయితే, తన కుటుంబంతోపాటు కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.