KMM: ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ మసీద్ సదర్ అజీజ్, ఆయన సోదరి ఇటీవల ఓ ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబాన్ని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పరామర్శించారు. మంగళవారం కస్పా బజారులోని మృతుల నివాసానికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి.. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.