AP: ఇసుకపై ప్రతిపక్షం చేసే ఆరోపణలు నమ్మవద్దని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు. ఇసుక కావాల్సిన వారు సొంతవాహనాల్లో తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఇసుక తవ్వకాల ఖర్చులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఉచిత ఇసుకను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.