నటుడు సల్మాన్ ఖాన్కు ఇటీవల ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే నంబర్ నుంచి ముంబై ట్రాఫిక్ పోలీసులకు తాజాగా మరో మెసేజ్ వచ్చింది. సల్మాన్ను బెదిరించి తప్పుచేశానన్న నిందితుడు.. క్షమించాలని అభ్యర్థించాడు. బెదిరింపు సందేశం జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ముంబై ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.