TG: గ్రూప్-1 పరీక్ష కోసం వెళ్లిన అభ్యర్థి గోడ దూకిన ఘటన హైదరాబాద్లోని బేగంపేట్ పరీక్షా కేంద్రంలో జరిగింది. అనుమతి సమయం మించిపోయాక ఆ అభ్యర్థి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఆలస్యమైందన్న కారణంతో అతన్ని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అప్పటికే గేట్లు మూసివేయటంతో అభ్యర్థి గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.