మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’. నవంబర్ 14న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ మూవీలో నటి సలోని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ షేర్ చేశారు. ఇందులో ఆమె ‘పద్మ’ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.