గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం తెలిపింది. గ్రూప్-1పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లారని.. ఈ విషయంలో ఇప్పుడు జోక్యం చేసుకోవటం సరికాదని పేర్కొంది. గ్రూప్-1పై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పింది. వచ్చే నెల 20లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.