జమ్మూకశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతి చెందిన వారిలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కూలీలు ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు చెప్పారు. కాగా.. ఈ ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు.