TG: బాచుపల్లిలోని ఇంటర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సెలవులకు ఇంటికి వెళ్లిన బాలికను తల్లిదండ్రులు తిరిగి కాలేజీలో దింపేందుకు ఆదివారం కళాశాలకు వచ్చారు. తిరిగి వెళ్లిన కొద్దిసేపటికి విద్యార్థి స్పృహ కోల్పోయిందని యాజమాన్యం వారికి సమాచారం అందించింది. వారు కళాశాలకు వచ్చేలోపే కాలేజీ సిబ్బంది విద్యార్థిని గాంధీ ఆసుపత్రికి తరలించడం, వారు వచ్చాక మరణించినట్లు చెప్పడంతో పలు అనుమానాలకు దారితీసింది.