AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. డ్యామ్ అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,64,765 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,33,635 క్యూసెక్కులు ఉంది. స్పిల్ వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.