పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జీ కర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పాట పాడింది. అయితే ఈ పాట అయిపోయాక దయచేసి ఎవరూ చప్పట్లు కొట్టొద్దని విజ్ఞప్తి చేసింది. దీంతో అక్కడి తన అభిమానులు తన నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. శ్రేయాను ప్రశంసిస్తూ తృణమూల్ నాయకుడు కునాల్ ఘోష్ పోస్ట్ పెట్టారు.