VSP: డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నామని ఆ విభాగం జిల్లా అధికారి చాముండేశ్వరరావు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99669 65502 నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.