హీరో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఓజీ షూట్‌ను రీస్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర గాసిప్ నెట్టింట రౌండప్ చేస్తోంది. పవన్ కుమారుడు అకీరా ఓజీలో కామియో రోల్లో కనిపించబోతున్నాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.