బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో వాసన్ బాలా తెరకెక్కించిన ‘జిగ్రా’ మూవీ ఈ నెల 11న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీపై కొందరు నెగటివ్‌గా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్ వాసన్ తన ఎక్స్ అకౌంట్‌ను డిలీట్ చేశారు. మరోవైపు ఆయన ఇన్‌స్టాలో యాక్టీవ్‌గా ఉన్నారు. ఈ సినిమాపై వస్తోన్న పాజిటివ్ కామెంట్స్‌ను స్టోరీలో పెడుతూ.. వారికి థ్యాంక్స్ చెబుతున్నారు.