MHBD: గార్ల మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం గుమ్మడి మహేష్ హత్యకి గురైనట్లు పోలీసులకు సమాచారం అందించారు. గార్ల ఎంపీడీవో ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ గామహేష్ పనిచేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న మహేష్ ను రాత్రి హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.