ADB: నేరడిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల నాయకులు ఆదివారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. రైతులకు రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు. వాన కాలంలో ఇచ్చే రైతు భరోసాను ప్రభుత్వం ఎగొట్టిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.