TG: రాజకీయాల నుంచి తాను నాయకత్వం అంటే ఏంటో తెలుసుకున్నానని CM రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో ISB లీడర్షిప్ సమ్మిట్‌కు రేవంత్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉందని మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నాయకులే ఉదాహరణ అని తెలిపారు. ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యం. తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతోపాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరమన్నారు.