E.G: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండపేట రూరల్ కేశవరం గ్రామంలో 1, 2 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆదివారం నిర్వహించారు. బీజేపీ నాయకులు సంగిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ కో కన్వీనర్ కోన సత్యనారాయణ విచ్చేశారు. ఈ మేరకు 48 సభ్యత్వాలు నమోదు చేశారు.