VZM: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ కోర్సు పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. జులై నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం నవంబర్ ఒకటో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.