TPT: వెంకటగిరి పట్టణంలోని పాల కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం ముందు సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నియోజకవర్గ ఇంఛార్జి వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ.. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఛార్జీలను తగ్గించకపోతే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.