చిత్తూరు: కుప్పం ద్రవిడ వర్సిటీ 27వ వ్యవస్థాపక దినోత్సవ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు లేకపోవడం పట్ల వివాదం చోటుచేసుకుంది. వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్సీ, ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌తో పాటు కలెక్టర్, కడ పీడీలను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను ముద్రించింది. అయితే ఇందులో సీఎం చంద్రబాబు పేరు లేకపోవడం పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.