AP: వైసీపీ MLC జకియాఖానంపై తిరుమల రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శన టికెట్లలో మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఆమెపై ఫిర్యాదు చేశారు. 6 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు రూ.65 వేలు వసూలు చేశారని పేర్కొన్నారు. బెంగళూరు భక్తులను MLC తన లేఖ ద్వారా VIP బ్రేక్ దర్శనానికి సిఫార్సు చేశారు. ఈ ఘటనలో MLCతో పాటు ఆమె పీఆర్వో కృష్ణతేజ, చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు.