NLR: ఈ నెల 22వ తేదీన నెల్లూరులోని జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి ఎం.వినయకుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్లిప్కార్ట్, ఇనోవ్సూర్స్, అపోలో ఫార్మసీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరుగుతుందన్నారు.