తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’ ఈ నెల 31న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న దర్శకుడు మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవికి అభిమానిని అని తెలిపారు. ఏదొక రోజు కచ్చితంగా సాయి పల్లవితో సినిమా చేస్తానని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.