జి. అశోక్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ‘పిల్ల జమీందార్’ మూవీ 2011లో రిలీజై మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై నిర్మాత డీఎస్ రావు అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం దీని సీక్వెల్ స్క్రిప్ట్‌పై దర్శకుడు అశోక్ పని చేస్తున్నారని, త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.