అక్టోబర్ 23న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డేను పురస్కరించుకుని ఆయన నటించిన పలు సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. అయితే ఆయన పుట్టినరోజు వేడుకలు కాస్త ముందుగానే మొదలయ్యాయి. ముఖ్యంగా జపాన్‌లోని అభిమానులు ప్రభాస్ బర్త్ డే వేడుకలను ముందుగానే జరుపుకున్నారు. ఈ మేరకు ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా స్పెషల్ షోను ప్రదర్శించారు. ఈ సినిమాను చూస్తూ ఫ్యాన్స్.. ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు.