TG: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఇవాళ BRS ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులు, నాయకులకు పిలుపునిచ్చారు. రైతు భరోసా విషయమై మండల కేంద్రాల్లో నిరసనలు చేయాలని కోరారు. వానాకాలం రైతుభరోసా ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు.