Woman married God Shiva: శివుడిని పెళ్లి చేసుకున్న యువతి, ఎందుకంటే?
మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా చౌరిసియా... శివుడిని పెళ్లి చేసుకున్నది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే కళ్యాణతోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాల వేసి, శివుడిని భర్తగా అంగీకరించింది.
మధ్యప్రదేశ్‌కు (madhya pradesh) చెందిన నిఖితా చౌరిసియా… శివుడిని (lord shiva) పెళ్లి చేసుకున్నది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే కళ్యాణతోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాల వేసి, శివుడిని భర్తగా (husband) అంగీకరించింది. నిఖిత ఎంబీయే చదివింది. శివుడిని పెళ్లి చేసుకోవడంపై ఆమె స్పందిస్తూ… ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో విచారం ఉంటుందని, అందుకే దానిని దూరం చేసుకునేందుకు, తాను ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేశానని చెబుతోంది. నిఖియా బ్రహ్మకుమారి సంస్థకు వెళ్తోంది. దీంతో బ్రహ్మకుమారి (Brahma Kumaries) ఆశ్రమంలో వివాహ ఆచార ప్రకారం పెళ్లి (marriage) చేసుకున్నది. బ్రహ్మకుమారిలో చేరిన చాలామంది యువతులు ఆ సంస్థకు తమ జీవితాన్ని అర్పిస్తుంటారు. అలాంటివారు శివుడిని భర్తగా అంగీకరిస్తారు. బ్రహ్మ కుమారీస్ వ్యవస్థాపకుడు దాదా లేఖ్‌రాజ్. ఇతను 1876యల పాకిస్తాన్లో సింధ్ ప్రాంతంలో జన్మించాడు. 1936లో అప్పటి నుండే ఓం మండలి అంటూ ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించాడు. అదే సమయంలో తనలోకి శివపరమాత్మ ప్రవేశించాడని చెబుతూ… బ్రహ్మబాబాగా పిలువబడ్డాడు. ఆ తర్వాత ఇందులో అమ్మాయిలు కూడా చేరారు. అదే తదనంతరం ప్రజాపిత బ్రహ్మకుమారీస్గా మారింది. ఈ సంస్థలో చేరిన కొంతమంది శివుడిని పెళ్లాడటం ద్వారా ఆ సంస్థ కోసం పూర్తిస్థాయిలో పని చేస్తారు.