VZM: కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా. సీతల్ వర్మ గ్రామస్తులకు శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి 34 మంది రోగులు వచ్చారు. జ్వరంతో ఉన్న నలుగురికీ టాబ్లెట్స్, టానిక్ ఇచ్చారు. కాచి చల్లారిన వేడినీళ్లు తాగాలని సూచించారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమ తెరలు వాడాలని సూచించారు.