AP: కృష్ణా జిల్లా నందివాడ మండలంలో నీటి శుద్ది పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి రూ.91 లక్షల వ్యయాన్ని ప్రభుత్వం కేటాయించింది. పల్లెపండుగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే వినతిపై స్పందించి గుడివాడ నియోజకవర్గంలో నీటి పరీక్షలు చేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. 43 గ్రామాల్లో నీటి పరీక్షలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.