TG: గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన BRS నేతలను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. BRS నేతలను మాత్రమే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆందోళన చేసిన BJP నేతలను ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. బీఆర్ఎస్కు ఒక న్యాయం.. బీజేపీకి ఒక న్యాయమా.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న చీకటి ఒప్పందం బట్టబయలైందని పేర్కొన్నారు.