కృష్ణా: DSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న SC,ST అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి. మోహనరావు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణలో చేరే విద్యార్థులు ఈ నెల 21లోపు జ్ఞానభూమి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష జరగనున్నట్టు తెలిపారు.