ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని చిరు వ్యాపారస్తులు శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలిపారు. కంభం రోడ్లో 30 సంవత్సరాలుగా బంకులు నడుపుతున్న మాపై అక్రమాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇవ్వడం దారుణమని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి పైన జీవనం సాగిస్తున్నామని, మాపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం దారుణం అన్నారు.