SKLM: పొందూరు మండలం కింతలి గ్రామంలో శనివారం పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.53 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాణ్యత కూడిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసీఎస్ ఛైర్మన్ సత్యారావు, సర్పంచ్ పైడి రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.