ELR: ఏలూరులో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసులో ప్రధాన నిందితుడు సుధాకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ మాట్లాడుతూ.. అధిక వడ్డీ వ్యాపారాలు చేసేవారు వేధింపులు మానుకోవాలని సూచించారు. బాధితులు ఎవరైనా ఉంటే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు వడ్డీ వ్యాపారాలు మనుకోవాలన్నారు.