SKLM: పొందూరులో ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో శనివారం ఎస్సై సత్యనారాయణ పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తగాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. తగాదాలలో తల దూరిస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా లైసెన్సులో లేకుండా వాహనాలు నడపరాదన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మోహన్ రావు, సాయి, తదితరులు ఉన్నారు.