TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4000 వేల ఇళ్లు అందిస్తామని, రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. పింకు చొక్కాలు, మూడు రంగుల జెండాతో సంబంధం లేకుండా పేదలకు ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.