VZM: నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎల్.కోట మండలంలోని చందులూరు గ్రామంలో 1000 గొర్రెలు, 350 మేకలకు నట్టల నివారణ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా.గాయత్రి ఆధ్వర్యంలో మందును తాగించారు. దీని వలన జీవాల మరణాలు తగ్గుతాయని తెలిపారు. పిల్లలు అధిక బరువుతో పెరుగుతాయన్నారు. పాలు, మాంసం, ఉన్ని దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. జీవాలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయన్నారు.