AP: విజన్‌తో అమరావతికి ప్లాన్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘అవరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ సిటీ. అతిపెద్ద సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. దేశంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, హోటల్స్ అమరావతికి వస్తున్నాయి. రూ.40 వేల కోట్లతో 50 పనులకు టెండర్లు పిలిచాం.YCP కారణంగా రూ.7వేల కోట్ల అదనపు భారం పడుతుంది. మూడేళ్లలో గ్రీన్‌సిటీగా అమరావతిని అభివృద్ధి చేస్తాం’ అని పేర్కొన్నారు.